KMM: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 18,351 మంది విద్యార్థులకు గాను 17,849 మంది హాజరుకాగా, 502 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఒక కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.