»Telangana Is Top In The India In Cesarean Operations 2023
Cesarean operations:లో తెలంగాణ దేశంలోనే టాప్
తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల(cesarean operations) గురించి కీలక విషయం బయటకొచ్చింది. సిజేరియన్ ఆపరేషన్లలో 2021-22లో 55.53 శాతంతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు దేశంలో ఈ సగటు కేవలం 23.29 శాతం ఉండటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అత్యధిక సిజేరియన్ ప్రసవాలు(cesarean operations) జరిగిన రాష్ట్రంగా తెలంగాణ(telangana) నిలిచింది. ఈ క్రమంలో 2020-21లో 55.33 శాతం సిజేరియన్ ప్రసవాలు ఉండగా.. 2021-22లో 55.53 శాతం జరిగాయి. మరోవైపు జాతీయ స్థాయిలో ఈ సగటు కేవలం 23.29 శాతం ఉండటం విశేషం. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) ఈ నివేదికను వెల్లడించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 47.13 శాతం జరుగుతుండగా..ప్రైవేటు ఆస్పత్రుల్లో 61.08 శాతం సిజేరియన్లు జరగుతున్నట్లు రిపోర్ట్ పేర్కొంది.
మాతాశిశు ఆరోగ్యానికి సంబంధించి పలు సూచీల్లో తెలంగాణ మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో సగానికి పైగా ప్రసవాలు సిజేరియన్లుగా ఉంటున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విశ్లేషించింది. మరోవైపు కేవలం 1,552 మంది కౌమార బాలికలకు(grils) మాత్రమే శానిటరీ న్యాప్కిన్ ప్యాక్లను అందించడంతో రాష్ట్రం శానిటరీ ప్యాడ్ల పంపిణీలో తక్కువ స్కోర్ సాధించింది. దీంతోపాటు బీహార్ (0.4%) తర్వాత తెలంగాణ రెండవ అతి తక్కువ అబార్షన్ రేటు 0.9% కలిగిన రాష్ట్రంగా నిలిచింది.
సిజేరియన్ ప్రసవాలు ప్రసవాలు 10 నుంచి 15 శాతానికి మించకూడదని ప్రపంచఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. కాన్పు సమయంలో తల్లి, శిశువు ప్రాణాలకు ముప్పు ఉంటే తప్ప సిజేరియన్ చేయకూడదని చెబుతున్నాయి. మరోవైపు అతి తక్కువ సిజేరియన్లు ఉన్న రాష్ట్రాల్లో బిహార్ (5.66శాతంతో) మొదటి స్థానంలో ఉంది.