MDK: జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఇన్చార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ ఆదేశించారు. జిల్లాలో జరిగిన ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యచరణ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. పంట వేయగానే ఆదాయం చేతికి రాదన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. పంట లాభాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.