Telangana : తెలంగాణలో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు
రాబోయే ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.రాగల ఐదు రోజులు తెలంగాణ (Telangana) లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రోహిణి కార్తె ఎండలతో సతమతం అవుతున్న తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాగల ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (weather station) తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు (Tamil Nadu) మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిందని, దీంతో గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగందో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్(Yellow alert)ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కొముర్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్(Mahbubabad), వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్నిచోట్ల ఉరుములు(thunder) మెరుపులతో కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది