WGL: దుగ్గొండి మండలం తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.