తెలంగాణ (Telangana) దశాబ్ది అవతరణ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. 20 రోజుల పాటు కాంగ్రెస్ (Congress) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhuyashki Goud) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 20 రోజులు కార్యకర్తలు తమ ఇళ్లపై కాంగ్రెస్ జెండాను వుంచాలన్నారు. అలాగే మండల కేంద్రాల్లో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ (Sonia Gandhi) చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (Political Affairs Committee) సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా భేటీలో తీసుకున్న వివరాలను మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వీ హనుమంతరావు (Hanumantha Rao) మీడియాకు తెలిపారు.
జూన్ 2 నుండి తొమ్మిదేళ్ల లో సీఎం కేసీఆర్ (CM KCR) వైఫల్యాలపై.. ఫెయిల్యూర్ కేసీఆర్ .. స్లోగన్ తో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు..త్వరలోనే బీసీ గర్జన కార్యక్రమం నిర్వహిస్తామని.. దీనికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆహ్వానిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ వైఫల్యాలపై 20 రోజుల పాటు పోరాటం నిర్వహిస్తామన్నారు. ఫెయిల్యూర్ కేసీఆర్ స్లోగన్‌తో తాము పోరాటం చేస్తామని చెప్పారు. సీనియర్ నేత వీహెచ్ నాయకత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పున: స్థాపన కోసం ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(MP Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. భారత పార్లమెంట్ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగమని ఆయన గుర్తుచేశారు.