HYD: హఫీజ్‌పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపల్ అత్యుత్సాహం ప్రదర్శించారు. జుట్టు ఎక్కువగా ఉందని, విద్యార్థికి బలవంతంగా గుండు కొట్టించారు. దైవ దర్శనం కోసం మొక్కు ఉందని విద్యార్థి వేడుకున్నా వినకుండా ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టాయి. ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.