ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న సీఎం జగన్ (Jagan)పై టీడీపీ తీవ్ర పోరాటం చేస్తోంది. అయితే టీడీపీ (Telugu Desam Party) పోరాటాన్ని తిప్పికొట్టడంలో వైసీపీ బ్యాచ్ విఫలమవుతోంది. చంద్రబాబు, లోకేశ్ (Nara Lokesh)ను విమర్శించలేక అడ్డదారులు తొక్కుతూ దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ (Telangana) యూట్యూబ్ చానల్ నటి, మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వను (Gangavva) పావుగా వాడుకున్నారు. వైసీపీ తీరుతో ఆ పెద్దావిడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఫలితంగా ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ముసలావిడ నోటి నుంచి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి..
ఉగాది పర్వదినం సందర్భంగా ఓ చానల్ లో ప్రసారమైన కార్యక్రమంలో గంగవ్వ పాల్గొని నటించింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలను (Horoscope) గంగవ్వతో చెప్పించారు. అందులో టీడీపీ అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu), జాతీయ ప్రధాన కార్యదదర్శి నారా లోకేశ్ ఫొటోలు చూపించి వారి జాతాలకు ఎలా ఉంటాయో గంగవ్వతో చెప్పించారు. తాను చెప్పలేనంటూ గంగవ్వ లేవగా.. బలవంతంగా బాబు పేరుపై జాతకం అడిగించారు. చంద్రబాబుకు గ్రహణం పట్టింది అని గంగవ్వ చెప్పింది. ఇక్కడి దాకా బాగానే ఉంది.
ఈ కార్యక్రమం ప్రసారం ఎప్పుడో జరగ్గా.. ఇప్పుడు కేవలం చంద్రబాబుకు చెప్పిన మాటను పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ట్రోలింగ్ (Trolling) చేస్తోంది. గంగవ్వ మాటలను పట్టుకుని తమ సామాజిక మాధ్యమాల్లో దీన్ని వైసీపీ సర్క్యులేట్ చేస్తోంది. దీనికి తోడు ఓ ప్రముఖ చానల్ (News Channel)లో ఈ మాటలను కూడా వైరల్ చేశారు. దీంతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగవ్వ ఉద్దేశపూర్వకంగా (Wantedly) చెప్పని మాటలను ట్రోల్ చేయడంపై మండిపడ్డారు. గంగవ్వ టీమ్ వెంటనే స్పందించింది. అసలు జరిగిన విషయాన్ని గంగవ్వతో చెప్పించారు. ఈ క్రమంలో ఆమె చంద్రబాబుకు క్షమాపణలు (Apologise) కోరింది.
‘నేను ఎవరో చెబితేనే నేను చెబుతా. నేను చదువుకోలేదు. నా గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు గురించి నేను చెప్పలేను అని చెప్పాను. కానీ ఆ టీవీ చానల్ వాళ్లు చెప్పడంతోనే అన్నాను. అంతే. నన్ను తప్పుగా భావించండి. క్షమించండి. మీ అందరి ఆదరాభిమానులతో ఇంతకు చేరాను. మాట (Word) జారితే క్షమించండి’ అని గంగవ్వ తెలిపింది. కుట్రపూరితంగా జగన్ కు సంబంధించిన చానల్స్ ఇలా పాపం అమాయకురాలైన గంగవ్వతో ఇలా చెప్పించడంపై సర్వత్రా విమర్శలు (Controverse) వస్తున్నాయి. రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలి తప్ప పాపం అమాయకులతో అబద్ధాలు (Fake) చెప్పించి పబ్బం గడుపుకోవాలని చూడడం తప్పని సాధారణ ప్రజలు కూడా చెబుతున్నారు.
ఇక గంగవ్వ వాస్తవాలు చెప్పడంతో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబును పని గట్టుకుని విమర్శించేందుకు కొన్ని చానల్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. బాబును తిట్టాలంటే మరి ఇంత దిగజారి ప్రవర్తించాలా? అని ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకు చంద్రబాబుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి నీచపు పని దిగజారారని మండిపడుతున్నారు. వెంటనే ఆ చానల్ నిర్వాహకులు గంగవ్వకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.
జగన్ మెప్పు పొందడం కోసం, అమాయకురాలైన గంగవ్వ తో చంద్రబాబు నాయుడు గారిని మాటలు అనిపించిన బులుగు మీడియా ఎన్టీవీ.. తనతో ఎన్టీవీ వాళ్ళు బలవంతంగా చెప్పించారు అని.. తప్పుగా అనుకోవద్దని వాపోయిన గంగవ్వ.. ఎన్టీవీ.. ఇదేమి దిగజారుడు? pic.twitter.com/DvnNF7qhWf
ఎన్టీవీ వాడి వనిత టీవీలో జాతకం పేరుతో ఆడిన వైకాపా పెయిడ్ ప్రోగ్రాం గుట్టు విప్పిన గంగవ్వ
జగన్ మెప్పు పొందడం కోసం, అమాయకురాలైన గంగవ్వ తో చంద్రబాబు నాయుడు గారిని మాటలు అనిపించిన బులుగు మీడియా ఎన్టీవీ.. ఎన్నడూ వివాదాల్లో దూరని గంగవ్వ, తనకు తానుగా ఇలా మాట్లాడే అవకాశం లేదు అని..(1/2) pic.twitter.com/EhWyEULLRx