టీమిండియాపై దిగ్గజాలు సచిన్, గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ఈ ట్రోఫీకి భారత క్రికెటర్లు పూర్తి అర్హులని సచిన్ కొనియాడాడు. క్రికెట్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనకు టీమిండియా ఎప్పటికీ ఓ బ్రాండ్ అని కితాబిచ్చాడు. అలాగే, టీ20 ప్రపంచకప్లో 25 నుంచి 30 పరుగుల తేడాతో గెలిస్తేనే పెద్ద విజయంగా భావిస్తామని.. ఇది అంతకంటే అతి భారీ విజయం అని గవాస్కర్ పేర్కొన్నాడు.