MDK: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. సోమవారం నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం, సఖి కేంద్రాలను సందర్శించారు. తరువాత కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా కలెక్టర్‌తో సమావేశమయ్యారు.