VZM: శక్తి యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని గంట్యాడ ఎస్సై సాయి కృష్ణ సూచించారు. సోమవారం గంట్యాడ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. మనమిత్ర గురించి ప్రజలకు వివరించాలన్నారు. పోలీస్ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలు రోడ్డు భద్రత సూత్రాల గురించి గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు.