పాక్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ లేకపోవడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. తాజాగా దీనిపై పాక్ కోచ్ మైక్ హెస్సెన్ స్పందించాడు. ‘బంగ్లా సిరీస్ నుంచి బాబర్‌ను తప్పించలేదు. ఈ సిరీస్‌ను యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే వేదికగా చూస్తున్నాము. బాబర్‌తో పాటు అయూబ్, నసీమ్ కూడా జట్టులో లేరు’ అని క్లారిటీ ఇచ్చాడు.