E.G: మానవజాతి మనుగడకు ప్రాణంపోసి, సమాజాన్ని ముందుకు నడిపించేది మహిళలు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులోని డా. బి.ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 1,211 స్వయం సహాయక సంఘాలకు చెందిన 11,850 మంది మహిళలకు మంత్రి రూ.149.34 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేశారు.