KRNL: నందవరం మండలం రాయచోటి గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ గ్రామ సభలో ఇవాళ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రైతులతో కలిసి భూమి సర్వే, సరిహద్దులను పరిశీలించి పట్టాదారు పాస్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు చేశారు.