VSP: జిల్లాలో 14వ సంవత్సరంలో అడుగుపెట్టిన బాలికలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ సోమవారం సూచించారు. జిల్లాలో గుర్తించిన 17,743 బాలికలకు 33 కేంద్రాల్లో ఉచితంగా టీకా అందిస్తామని తెలిపారు. టీకా ముందు ఆహారం తీసుకోవాలని, టీకా తర్వాత 30 నిమిషాలు పరిశీలనలో ఉంచాలని చెప్పారు.