సత్యసాయి: లేపాక్షికి చెందిన బేబీ కేయాన్స్ అనే బాలుడు అడ్విక్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్–2 అనే అరుదైన వ్యాధితో 21 నెలలుగా బాధపడుతున్నాడు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ‘ప్రాణాలను కాపాడేందుకు AVXS-101 అనే ఇంజెక్షన్ అవసరం. దీని ధర సుమారు రూ.16 కోట్లు. ఈ మందు భారత్లో తయారు కావడం లేదు’ అని పేర్కొన్నారు. దీంతో చికిత్స కోసం ప్రజలు, ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.