SRD: కల్హేర్ మండలం మార్డీ గ్రామంలో సోమవారం రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు సంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జాతరను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.