AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ ఇవాళ్టితో ముగియనుంది. అయితే, దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది.