WNP: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో రేపు మంగళవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి, మహబూబ్ నగర్, హైదరాబాద్లోని వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పనకు వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.