AP: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రధాన కాలువపై రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన వంతెనకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే పాలకొల్లు పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం ఎంతో మెరుగుపడనుంది. ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.