TG: ప్రస్తుతం కొన్నిచోట్ల ఆహ్వానం లేకుండానే పెళ్లి విందులకు వెళ్లే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్‌లో కొన్ని ఫంక్షన్ హాల్స్ ముందు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు వైరల్‌గా మారాయి. “సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం.. మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.5,000 వరకు జరిమానా విధించబడును” అని పేర్కొన్నారు.