మావోయిస్టు ఉద్యమం పూర్తిగా బలహీనపడిందని మాజీ మావోయిస్టు వాసుదేవరావు అన్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుందని తెలిపారు. కగార్ ఆపరేషన్ను ఎదుర్కోలేకపోయామని చెప్పారు. జైల్లో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు, హక్కుల నేతలపై కేసులు కొట్టేయాలని డిమాండ్ చేశారు. అలాగే, గణపతికి సంబంధించిన సమాచారం తమ దగ్గర లేదన్నారు.