Ponguleti Srinivas Reddy: మరోసారి అధికారంలోకి వచ్చేందుకు.. కేసీఆర్ కుట్రలు
సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన కుట్రలన్నీ చేస్తున్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. అధికారులను అడ్డం పెట్టుకొని ఆత్మీయ సమ్మేళనాన్ని కట్టడి చేయటానికి ప్రయత్నించారన్నారు.
Ponguleti Srinivas Reddy: సీఎం కేసీఆర్(CM KCR) మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన కుట్రలన్నీ చేస్తున్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఆరోపించారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. అధికారులను అడ్డం పెట్టుకొని ఆత్మీయ సమ్మేళనాన్ని కట్టడి చేయటానికి ప్రయత్నించారన్నారు. సభకు రాకుండా జనాలని బెదిరింపులకు గురిచేశారన్నారు. జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నామన్నారు. మాటల గారడీలతో కేసీఆర్ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారని.. అలాగే రెండుసార్లు అధికారంలోకి వచ్చారన్నారు. మూడోసారి కూడా అదే పంథాలో అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కానీ ప్రజలు తనను నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ చెప్పే మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
రైతులకు(Farmers) అందించే అన్ని రకాల స్కీంలను ప్రభుత్వం(Governament) రద్దు చేసిందని, ఒక్క రైతుబంధు(Raitubandhu) అందించి ఏదో గొప్పపని చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయం వచ్చే వాటిపై దృష్టి ఉంటుందే తప్పా, ప్రజా సమస్యలను పట్టించుకోరని ఆరోపించారు. ప్రజా బలంతో ఎవరినైనా ఎదుర్కొవడానికి తాను సిద్దంగా ఉన్నానని, అది ఎంత పెద్ద వ్యక్తులైనా సరేనని సవాల్ విసిరారు పొంగులేటి. మరోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ అనేక కుట్రలకి పాల్పడుతున్నాడని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడో ఒకచోట కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని ప్రచారానికి ఉపయోగించుకుంటారు. ఇదే క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అజయ్ పై తాను పోటీ చేసి గెలవడం కాదు… అతనిపై బచ్చాగాన్ని పెట్టైనా గెలిపిప్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్(puvvada Ajay) భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. మంత్రి తన అనుచరులతో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, ఖమ్మంలో ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నారు.