VZM: భోగాపురంలో ఎమ్మెల్యే నాగ మాధవిని ఉత్తరాంధ్ర గీత కార్మిక సంఘ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అసెంబ్లీలో గీత కార్మికుల సమస్యలను ప్రస్థావించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అసెంబ్లీలో మాట్లాడానని, సమస్యలను సంబంధించిన మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు.