KDP: దువ్వూరు ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో సోమవారం ఎంపీపీ జయచంద్రారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని ఎంపీడీవో సుబ్బారెడ్డి తెలిపారు.