అన్నమయ్య: వికసిత్ భారత్ – జి రామ్ జీ పథకం కింద 125 రోజుల ఉపాధి హామీ గోడపత్రికను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పీజీఆర్ఎస్ హాల్లో ఆవిష్కరించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి పథకం అమలై గ్రామాల అభివృద్ధితో పాటు ఉపాధి వేతనదారులకు 125 రోజుల పని కల్పిస్తామని తెలిపారు. రైతులకు వ్యవసాయ సీజన్లో కూలీల కొరత లేకుండా ఉండేందుకు 60 రోజుల ఉపాధి విరామం కూడా ఉంటుందని చెప్పారు.