TG: మణుగూరు బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి హాస్టల్లో పెట్టిన ఆహారం తిన్నారు. ఇవాళ ఉదయం విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపించాయి. హాస్టల్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పరీక్షించి ఫుడ్ పాయిజన్ అయినట్లు వైద్యులు గుర్తించారు.