MBNR: మహబూబ్ నగర్లోని అంధుల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జి. అంకిత సీఎం కప్ టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన సీఎం కప్- 2 దివ్యాంగుల పోటీలలో జి.అంకిత 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, షాట్ పుట్లో సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో పాఠశాల హెచ్ఎం రాములు, పీడీ మధుసూదన్,జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.