MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కాలేజీలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమెన్ సెల్ సంచాలకుడు డాక్టర్ నూర్జహాన్ మాట్లాడుతూ.. మహిళలు ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో ముందడుగు వేస్తే రాణించలేని రంగం లేదని అన్నారు. విద్యార్థులు లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.