NLG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం మిర్యాలగూడ మినీ రవీంద్ర భారతిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఛైర్ పర్సన్ సుధా బాలకృష్ణ, వైస్ ఛైర్ పర్సన్ శిరీష, డీఎస్పీ రాజశేఖర్ రాజు, కమిషనర్ శ్రీనివాస్ పాల్గొని మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల సేవలను కొనియాడారు.