MDK: పటాన్చెరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనివల్ల కార్మికులు, పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. 20 ఎకరాల భూమి కేటాయించి ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.