ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన అచన 108 వాహనంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అచనకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు అధికమై వాహనంలోనే ప్రసవం జరిగిందన్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు