న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ ఫిన్ అలెన్ టీమిండియా బౌలర్ బుమ్రాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నా మంత్రం చాలా స్పష్టం. బంతిని చూసి ఆడతాను తప్ప, బౌలర్ పేరును చూసి కాదు. అవతల బుమ్రా పరిగెత్తుకుంటూ వస్తున్నాడని ఆలోచిస్తే.. ఆట కంటే ఒత్తిడికే ఎక్కువ లోనవుతాం. అందుకే నేను బౌలర్ ప్రతిష్ట గురించి ఆలోచించకుండా కేవలం బాల్ మీద మాత్రమే ఫోకస్ చేస్తా’ అని పేర్కొన్నాడు.