రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థ ప్రతినిధి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.