MBNR: హన్వాడ మండలం లింగన్నపల్లిలో ఆదివారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వామివారి కృప గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.