మన్యం: మహిళ సాధికారితతోనే సమాజం అభ్యున్నతి సాధిస్తుందని జిల్లా ఎస్పీ ఎస్.వీ.మాధవరెడ్డి అన్నారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న లయన్స్ క్లబ్లో ఎం.ఎస్.పీలు, విద్యార్థులు, మహిళ సిబ్బందితో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకొన్నారు. ఎస్పీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.