BDK: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాచలం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ముఖ్యమైనది అని పేర్కొన్నారు.