GWL: బహుజన రాజ్యాధికార విప్లవం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని బహుజన రాజ్యసమితి జిల్లా నాయకుడు వినోద్ అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దిగువ, మధ్య తరగతి మహిళలు ఉద్యమాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఆధిపత్య వర్గాల వల్ల బహుజనుల మధ్య సమన్వయం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.