KMM: కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా గ్రామ పంచాయితీ కార్యాలయంలో 109 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, ప్రజా ప్రభుత్వంలో మహిళలను కోటీశ్వరులను చేసే సదుద్దేశంతో పనిచేస్తుందని, మహిళా అభివృద్దె ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు.