TG: దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ బెస్ట్ అని CM రేవంత్ అన్నారు. ఢిల్లీ కాలుష్యంతో, ముంబై వరదలు, బెంగళూరు ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతున్నాయన్నారు. చంద్రబాబు, YSR హైదరాబాద్‌ని దేశంలోనే ఒక ఉత్తమ నగరంగా తీర్చిదిద్దారని.. అయితే ప్రపంచ నగరాలతో పోటీ పడేందుకు ఇది సరిపోదని పేర్కొన్నారు. నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు మహిళలు ముందుకు రావాలని కోరారు.