NRPT: బోయిన్పల్లి తండాలో పాముకాటుకు గురైన వైష్ణవి అనే చిన్నారిని సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ సకాలంలో ఆసుపత్రికి చేర్చి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం ఆటలాడుతుండగా పాపను పాము కరవడంతో, గమనించిన సర్పంచ్ వెంటనే తన కారులో అప్పక్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో పాప ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని డాక్టర్లు తెలిపారు.