ATP: బెలుగుప్ప మండలంలో అకాల వర్షాలు, ఈదురు గాలులకు దెబ్బతిన్న పంటలను ఉరవకొండ వైసీపీ సమన్వయకర్త వై. విశ్వేశ్వర్ రెడ్డి శనివారం పరిశీలించారు. అంకంపల్లి, దుద్దేకుంట, గంగవరం గ్రామాల్లో నేలకొరిగిన అరటి, మొక్కజొన్న తోటలను చూసి రైతులకు ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.