MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు, రోగులకు మంచి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఆదివారం లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాలలో ఉన్న ప్రజలకు, రోగులకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు.