MDK: తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ పై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఎంజాల స్వామి, ఉప సర్పంచ్ హనుమంతు విధుల్లో పర్యటించారు. తడి, పొడి చెత్తను వేరుచేసి అందజేయాలని మహిళలకు సూచించారు. చుట్టుపక్కల పరిసరాల్లో మురుగునీరు నిలువ కాకుండా చూసుకోవాలన్నారు. చెత్తను నిల్వ ఉంచుకోకుండా చెత్తబండికి వేయాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ బాద్యత వహించాలన్నారు.