గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని పోలీస్ సిబ్బంది సమస్యలను విన్నారు. విచారణలో ఉన్న సిబ్బందిని నిబంధనల ప్రకారం విధుల్లోకి తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ పోలీసు శాఖపై నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.