AP: పోలవరం, కాకినాడ జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. శనివారం డి.కృష్ణవరం దగ్గర ఆవు, దూడపై దాడి చేసింది. చంపిన దూడ కళేబరాన్ని రాత్రి లాక్కెళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పులిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. దాని జాడ కోసం డ్రోన్లు వినియోగిస్తున్నారు.