HYD: రంజాన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆకాంక్షించారు. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లోని అలియా మసీదులో నిన్న నిర్వహించిన ‘దావత్-ఈ-ఇఫ్తార్’ వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైనార్టీ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.