మార్చి తొలి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఒంగోలు, అమరావతి, నంద్యాల, నెల్లూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో 39 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాపట్ల, మచిలీపట్నం, కావలి, నెల్లూరు, ఒంగోలు, తదితర ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుంచి 6.5 డిగ్రీలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో ఉష్ణోగ్రతల్లో 7 నుంచి 8 డిగ్రీల పెరుగుదల కనిపించిందని వాతావరణశాఖ వెల్లడించింది.