ప్రస్తుతం కోలీవుడ్‌లో సెట్స్ పై ఉన్న సినిమాల్లో.. ఇళయ దళపతి విజయ్ 'లియో' మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా ఉంది. ఈ సినిమాను యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా షూటింగ్లో యాక్షన్ కింగ్ అర్జున్ జాయిన్ అయ్యాడు.
లాస్ట్ ఇయర్ వచ్చిన కమల్ హాసన్(Kamal hasan) ‘విక్రమ్’ సినిమా.. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఈ సినిమా దెబ్బకు కమల్ హాసన్‌కు ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి. మరోసారి లోకేష్(Lokesh) తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఈ ఏడాదిలో ఆరంభంలో సంక్రాంతికి ‘వారిసు’గా వచ్చిన విజయ్(Vijay).. భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ జోష్‌లో వెంటనే లోకేష్‌తో ‘లియో’ సినిమా(Leo Movie)ను స్టార్ట్ చేసేశాడు విజయ్. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబో కావడంతో.. లియో పై భారీ అంచనాలున్నాయి.
తాజాగా చైన్నైలో ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ కింగ్ అర్జున్(Action king Arjun) జాయిన్ అయ్యాడు. మామూలుగా అర్జున్ అంటేనే యాక్షన్ పీక్స్‌లో ఉంటుంది. అలాంటి యాక్షన్ కింగ్‌తో లోకేష్(Lokesh) ఎలాంటి ఫైట్స్ చేయిస్తున్నాడనేది.. లియో (Leo)పై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. చైన్నైలోనే ఈ షెడ్యూల్ కొన్ని రోజుల పాటు సాగనుందట. అక్టోబర్ 19న ‘లియో’ మూవీ(Leo Movie)ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకు విక్రమ్‌తో గూస్ బంప్స్ తెప్పించిన అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichandran) సంగీతం అందిస్తున్నాడు. సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో.. చెన్నై చిన్నది త్రిష(Trisha) హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరి లియో ఎలా ఉంటుందో చూడాలి.