AKP: ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్స్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారిణి ప్రవీణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు.